55 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

55 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

Jan 8 2026 7:12 AM | Updated on Jan 8 2026 7:12 AM

55 క్

55 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

తల్లాడ: తల్లాడ మండలం మల్సూర్‌తండా, మిట్టపల్లి గ్రామాల్లో అక్రమంగా నిల్వ చేసిన 55 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. మల్సూర్‌తండాలో భూక్యా బద్రి ఇంట్లో 45 క్వింటాళ్లు, మిట్టపల్లిలో షేక్‌ బడేసాహెబ్‌ ఇంటి వద్ద పది క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్‌.వెంకటకృష్ణ తెలిపారు. తనిఖీల్లో సిబ్బంది శశికుమార్‌, ఆంగోతు శ్రీనివాసరావు, నరేష్‌ పాల్గొన్నారు.

అక్రమ ఫైనాన్స్‌ కేసులో ఇద్దరి అరెస్ట్‌

ఖమ్మంఅర్బన్‌: చట్టవిరుద్ధంగా అధిక వడ్డీతో ఫైనాన్స్‌ నిర్వహిస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని ఖమ్మం అర్బన్‌ పోలీసులకు అప్పగించారు. ఖమ్మం దానవాయిగూడెంకు చెందిన పలువురి ఇచ్చిన ఫిర్యాదతో తనిఖీలు చేపట్టగా సారధినగర్‌కు చెందిన శివకుమార్‌, దీపాకుమారి అధికవడ్డీతో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నట్లు తేలిందని టాస్క్‌ ఫోర్స్‌ ఏసీపీ సత్యనారాయణతెలిపారు. వీరి నుంచి ప్రామిసరీ నోట్లు స్వాధీ నం చేసుకోగా, పరారీలో ఉన్న మరో వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు

సత్తుపల్లిరూరల్‌: కోడి పందేలు నిర్వహించిన వారితో పాటు ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని సత్తుపల్లి సీఐ శ్రీహరి హెచ్చరించారు. గతంలో కోడి పందేలు, జూదం నిర్వహించిన వారితో పాటు ఇసుక అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారికి బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించి తహసీల్దార్‌ ఎదుట 17మందిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. కాగా, చైనా మంజా విక్రయాలను అరికట్టేలా తనిఖీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. చైనా మాంజా విక్రయించడం, కొనుగోలు చేయడం పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం నేరమని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే జైలు శిక్షతో పాటు రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని వెల్లడించారు.

రూ.84వేల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం

ఖమ్మంక్రైం: జిల్లా కేంద్రంలో కొంతకాలంగా నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సిగరెట్లను విక్రయిస్తున్నారనే సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బుధవారం తనిఖీలు చేపట్టారు. టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ సత్యనారయణ నేతృత్వాన ఖమ్మం పాత మున్సిపాలిటీ సమీపంలోని ఓ కిరాణం దుకాణంలో తనిఖీ చేయగా నిషేధిత, హానీకరమైన విదేశీ సిగరెట్లు అమ్ముతున్నట్లు తేలింది. దీంతో వివిధ కంపెనీలకు చెందిన రూ.84,700విలువైన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తునకు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు పేర్కొన్నారు.

55 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం
1
1/2

55 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

55 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం
2
2/2

55 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement