సత్తుపల్లి జిల్లా చేయండి
సత్తుపల్లి/కల్లూరు రూరల్: జిల్లాల పునర్విభజనపై దృష్టి సారించిన నేపథ్యాన సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిసి సత్తుపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ దయానంద్‌తో కలిసి ఆమె సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం హైదరాబాద్‌లో వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన ప్రియాంకగాంధీ జిల్లా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కొత్త మండలాల ఏర్పాటుపైనా సీఎంకు వివరించారు. ఆతర్వాత రాగమయి దంపతులు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి కల్లూరులో ఆస్పత్రి ప్రారంభానికి రావాలనికోరారు.
●పెనుబల్లి: మౌంట్ ఎవరెస్ట్ ఎక్కేందుకు ప్రభుత్వం తరఫున సహకరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని పెనుబల్లి మండలం సోమ్లానాయక్ తండాకు చెందిన మోతీకుమార్ కోరారు. ఎమ్మెల్యే రాగమయి దయానంద్‌తో కలిసి ఆయన సీఎంను కలిసి మాట్లాడారు. తన తల్లిదండ్రులు పండ్ల విక్రయిస్తుండగా, సొంత ఇల్లు లేకున్నా అడ్డంకులను అధిగమిస్తూ పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నానని తెలి పారు. ఇప్పటికే కిలి మంజారో, మౌంట్ ఎల్బ్రన్ పర్వతాలు అధిరోహించగా, ఎవరెస్ట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దీంతో సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే వినతి


