70 రోజులు.. రూ.1.61 కోట్లు
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. ఈసందర్భంగా 70 రోజులకు గాను రూ.1,61,02,694 ఆదాయం లభించిందని ఈఓ దామోదర్‌రావు తెలిపారు. ఇదికాక మిశ్రమ బంగారం 141 గ్రామలు, మిశ్రమ వెండి 850 గ్రాములతో పాటు అమెరికా, సింగపూర్, కెనడా, నేపాల్, సౌత్ కొరియా తదితర దేశాల కరెన్సీ వచ్చాయని వివరించారు. ఈకార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు, బ్యాంక్ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
భద్రాద్రి రామాలయంలో కానుకల లెక్కింపు


