కొత్త మిర్చి వచ్చేసింది! | - | Sakshi
Sakshi News home page

కొత్త మిర్చి వచ్చేసింది!

Nov 20 2025 7:34 AM | Updated on Nov 20 2025 7:34 AM

కొత్త

కొత్త మిర్చి వచ్చేసింది!

ఖమ్మంవ్యవసాయం: ఈ ఏడాది వానాకాలంలో సాగు చేసిన మిర్చి పంట బుధవారం ఖమ్మం మార్కెట్‌కు విక్రయానికి వచ్చింది. కామేపల్లి మండలం బర్లగూడెంకు చెందిన రైతు బానోత్‌ రవి తన సాగు చేసిన ‘తేజ’ రకం మిర్చి మొదటి కోత ఆరుబస్తాలను అమ్మకానికి తీసుకొచ్చాడు. ఈమేరకు పూజలు చేసి కొనుగోళ్లను ప్రారంభించగా, ఎర్ర మిర్చి క్వింటాకు రూ.15,039, తాలు మిర్చికి రూ.8,118గా ధర పలికింది. సాధారణంగా మిర్చి కోతలు, విక్రయాలు డిసెంబర్‌ చివరి వారం నుంచి ప్రారంభమవుతాయి. కానీ సీజన్‌ ఆరంభంలో మిర్చి సాగు చేయడంతో పంట ముందస్తుగా చేతికొచ్చిందని రైతు వెల్లడించాడు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రధాన కార్యదర్శి జీవై.నరేష్‌, మిర్చి శాఖ కార్యదర్శి యడ్లపల్లి సతీష్‌, మార్కెట్‌ సహాయ కార్యదర్శి వీరాంజనేయులు పాల్గొన్నారు.

పత్తి కొనుగోళ్లు ప్రారంభం

ఖమ్మంవ్యవసాయం: కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లు బుధవారం నుంచి పునఃప్రారంభమయ్యాయి. నిబంధనల కారణంగా తాము ఇబ్బంది పడుతున్నామని జిన్నింగ్‌ మిల్లుల యాజమాన్యాలు ఈనెల 17నుంచి కొనుగోళ్లు నిలిపివేసిన విష యం విదితమే. ఈమేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులు చర్చించడంతో బుధవారం తిరిగి కొనుగోళ్లు మొదలుపెట్టారు. కాగా, జిల్లాలోని ఎనిమిది జిన్నింగ్‌ మిల్లుల ద్వారా ఇప్పటి వరకు 2,650 మంది రైతుల నుంచి 4,650 మెట్రిక్‌ టన్నుల పత్తి కొనుగోలు చేశారు. ఇందులో 2వేల మంది రైతుల ఖాతా ల్లో రూ.38.68 కోట్లు జమ అయ్యాయని జిల్లా మార్కెటింగ్‌ శాఖాధికారి ఎంఏ.అలీం తెలిపారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో

ప్రసవాలు పెరగాలి

నేలకొండపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుతున్న సేవలపై గర్భిణులకు అవగాహన కల్పించి ప్రసవాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ ఆదేశించారు. నేలకొండపల్లి ఆస్పత్రిని బుధవారం తనిఖీ చేసిన ఆమె ల్యాబ్‌, కాన్పుల గది, ఆపరేషన్‌ థియేటర్‌ను పరిశీలించారు. ఆతర్వాత చెరువుమాధారంలోని పల్లె దవాఖానాను పరిశీలించాక వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ప్రసవాల సంఖ్య పెరిగేలా కావాల్సిన వసతులపై ప్రతిసాదనలు సమర్పించాలని సూచించారు. కాగా, సీహెచ్‌సీకి తాకిడి పెరుగుతున్నందున పీహెచ్‌సీని చెరువుమాధారం తరలించాలని ఆదేశించారు. కాగా, ఆస్పత్రి స్థలం ఆక్రమణపై స్థానికులు, పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని స్వీపర్లు వినతిపత్రం అందించారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి కె.రాజశేఖర్‌, ఎంపీడీఓ ఎం.యర్రయ్య, ఎంపీఓ సీ.హెచ్‌.శివ, పంచాయతీరాజ్‌ డీఈఈ వంశీ, ఏఈ ప్రసాద్‌, వైద్యాధికారులు మంగళ, కె.రాజేష్‌, శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

నైపుణ్యాల పెంపుపై దృష్టి

ముదిగొండ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో చదివే నైపుణ్యాలు పెంచేలా బోధన సాగాలని జెడ్పీ సీఈఓ దీక్షారైనా సూచించారు. మండలంలోని మిట్టగూడెం, మాధాపురం ప్రాథమిక పాఠశాలలను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదాలను బోర్డుపై రాస్తూ విద్యార్థులతో చదివించారు. అనంతరం సీఈఓ మాట్లాడుతూ విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ కనబరుస్తూ నైపుణ్యాలు పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎంపీడీఓ శ్రీధర్‌స్వామి, ఎంఈఓ రమణయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రైతుల ఖాతాల్లో

‘పీఎం కిసాన్‌’ నగదు

ఖమ్మంవ్యవసాయం: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం 21వ విడత నగదును బుధవారం కేంద్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. జిల్లాలో 1.05 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున రూ.21 కోట్ల మేర జమ అయ్యాయని తెలిసింది. సన్న, చిన్నకారు రైతులకు పంటల పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6 వేలను మూడు విడతలుగా అందిస్తోంది. ఈ ఏడాదికి సంబంధించి యాసంగి సీజన్‌ సమీపిస్తున్న నేపథ్యాన నగదు జమ చేశారు.

కొత్త మిర్చి వచ్చేసింది!
1
1/2

కొత్త మిర్చి వచ్చేసింది!

కొత్త మిర్చి వచ్చేసింది!
2
2/2

కొత్త మిర్చి వచ్చేసింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement