వైభవంగా గ్రామోత్సవం
ఖమ్మంగాంధీచౌక్: కార్తీకమాసం బహుళ చతుర్దశి సందర్భంగా బుధవారం మహాశివుడి గ్రామోత్సవం ఖమ్మంలో వైభవంగా సాగింది. ట్రంకు రోడ్డులోని శ్రీ భమరాంబ సమేత శ్రీ గుంటు మల్లేశ్వరస్వామి వార్ల ఊరేగింపు రాత్రి కనుల పండువగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను ప్రత్యేక వాహనంపైకి చేర్చి మేళతాళాలు, నృత్యాలు, కోలా టాల నడుమ ఊరేగించగా భక్తులు స్వాగతం పలికారు. అర్చకులు దాములూరి వీరభద్రరావు, కృష్ణశర్మ, ఈఓ రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
23న ఓటర్ల తుది జాబితా
ఖమ్మం సహకారనగర్: త్వరలో గ్రామపంచా యతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఓటర్ల జాబితా మరోసారి పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఆదేశించారు. ఈమేరకు రీ పబ్లికేషన్ షెడ్యూల్ విడుదలైంది. గతంలో ఆగస్టు 26న విడుదలైన నోటిఫికేషన్ ఆధారంగా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసి సెప్టెంబర్ 2న ప్రకటించారు. ప్రస్తుతం జీపీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యాన తప్పులు సరిచేయడంతో పాటు అవసరమైన మార్పులు చేసి ప్రచురించాలని కమిషనర్ ఆదేశించారు. ఈమేరకు 20వ తేదీ నుంచి దరఖాస్తులు పరిశీలిస్తూ అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఆపై 22న అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాక 23వ తేదీన తుది జాబితాతో పాటు పోలింగ్‌స్టేషన్ల జాబితా విడుదల చేస్తారు.
పరిశీలకుల నియామకం
జీపీ ఎన్నికలు సమీపిస్తున్నట్లు తెలుస్తుండగా జిల్లాల వారీగా పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. జిల్లా జనరల్ అబ్జర్వర్‌గా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ పీడీ వి.వెంకటేశ్వరరెడ్డి, వ్యయ పరిశీకులుగా సూర్యాపేట జిల్లా ఆడిట్ ఆఫీసర్ బి.శ్యాంసుందర్‌ప్రసాద్ నియమితులయ్యారు.
గుంటు మల్లన్నకు భక్తుల నీరాజనం


