పెళ్లికి నిరాకరించిందని. మేనకోడలి హత్య! | Daughter-In-Law murder In Karnataka | Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరించిందని. మేనకోడలి హత్య!

Mar 20 2024 9:35 AM | Updated on Mar 20 2024 1:18 PM

 Daughter-In-Law murder In Karnataka - Sakshi

తనతో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ మేనమామ తన అక్క కుమార్తెను హత్య చేసిన దారుణ ఘటన హావేరి జిల్లా హనగల్‌ తాలూకా బైచవళ్లిలో జరిగింది.

యశవంతపుర: తనతో నిశ్చితార్థం చేసుకుని పెళ్లికి నిరాకరించిందనే కారణంతో ఓ మేనమామ తన అక్క కుమార్తెను హత్య చేసిన దారుణ ఘటన హావేరి జిల్లా హనగల్‌ తాలూకా బైచవళ్లిలో జరిగింది. దీప (21)ను మేనమామ మాలతేశ బార్కి (35) హత్య చేశారు. ఈ ఘటన అలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... అక్క కూతురినే పెళ్లి చేసుకోవాలని బార్కి అక్కతో పాటు కుటుంబ సభ్యులను ఒప్పించాడు. అయితే దీపకు మేనమామతో వివాహం ఇష్టం లేదు. కుటుంబ సభ్యుల బలవంతంతో ఏప్రిల్‌లో నిశ్చితార్థం చేసి పెళ్లి తేదీని కూడా నిర్ణయించారు.

అయితే మేనమామ ప్రవర్తన దీపకు నచ్చలేదు. అప్పుడప్పుడు తాగి వచ్చి దీప పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో తాగుబోతును తాను పెళ్లి చేసుకోనంటూ దీప తల్లిదండ్రులకు తెగేసి చెప్పింది. నిశ్చితార్థం తరువాత తనను పెళ్లి చేసుకోనంటూ చెప్పటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మాలతేశ బార్కి.. ఆమెకు మాయమాటలు చెప్పి ఓ నిర్జన ప్రాంతానికి   తీసుకెళ్లి విషం ఇచ్చి అనంతరం ఉరి  వేశాడు.   దీప కనిపించటంలేదని తల్లిదండ్రులు గాలిస్తుండగా అనుమానంతో మాలతేశ బార్కిని విచారించగా అసలు విషయం బయట పడింది. దీంతో హనగల్‌ పోలీసులు మాలతేశను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement