మహానగర పాలికె కమిషనర్‌ బదిలీ | - | Sakshi
Sakshi News home page

మహానగర పాలికె కమిషనర్‌ బదిలీ

Aug 31 2026 1:56 AM | Updated on Aug 31 2026 1:56 AM

రాయచూరు రూరల్‌: రాయచూరు మహానగర పాలికె కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న జుబీన్‌ మోహ పాత్రోను యాదగిరి జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. దావణగెరె జిల్లా పంచాయతీ సీఈఓగా ఉన్న గిట్టి మాధవ్‌ విఠల్‌ను బీదర్‌ జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమించారు. కలబుర్గి డివిజన్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌గా సేవలందిస్తున్న సాహిత్య అలదకట్టిని దావణగెరె జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బదిలీ చేస్తూ సిబ్బంది, పరిపాలనా సంస్కరణల శాఖ అధీన కార్యదర్శి మహంతేష్‌ ఉత్తర్వులు జారీ చేశారు. యాదగిరి జిల్లా పంచాయతీ సీఈఓగా పని చేస్తున్న రాహుల్‌ తుకారం పాండ్వే, అలాగే బీదర్‌ జిల్లా పంచాయతీ సీఈఓగా ఉన్న గిరీష్‌ దిలీప్‌ బదోలెను ప్రభుత్వం బదిలీ చేసింది. అయితే వీరికి ప్రస్తుతం ఎలాంటి కొత్త పోస్టింగ్‌లు కేటాయించకుండా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వేచి ఉండాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement