నేపాల్‌ ప్రజలను ఆదుకుంటాం | - | Sakshi
Sakshi News home page

నేపాల్‌ ప్రజలను ఆదుకుంటాం

Aug 31 2026 1:56 AM | Updated on Aug 31 2026 1:56 AM

రాయచూరు రూరల్‌: రపకృతి వైపరీత్యాల కారణంగా సర్వస్వం కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న నేపాల్‌ దేశ ప్రజలను ఆదుకోవడానికి మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం తరపున సంపూర్ణ సహాయ సహకారాలు (ఆపన్నహస్తం) అందిస్తామని పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీ పాదంగల్‌ హామీ ఇచ్చారు. రాఘవేంద్ర స్వామి 355వ ఆరాధనోత్సవాలు, సప్తరథోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మఠంలో ఏర్పాటు చేసిన ధార్మిక సభలో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. హిందూ సనాతన ఆచార విచారాలకు విరుద్ధంగా నడుచుకుంటున్న తీరుతో ఇలాంటి భయంకరమైన ప్రకృతి ఉపద్రవాలు సంభవిస్తున్నాయని తెలిపారు. దేవుడు, దానం, ధర్మం, భక్తి, సంస్కృతి అనే ఐదు ముఖ్యమైన జీవన సూత్రాలను మానవులు మరచిపోతున్నారని పేర్కొన్నారు. నాస్తికులను సైతం పరమ ఆస్తికులుగా మార్చిన ఘనత రాఘవేంద్రస్వామి వారికే దక్కిందని కొనియాడారు.

హుబ్లీ–ధార్వాడ

పోలీస్‌ కమిషనర్‌గా భూషన్‌

హుబ్లీ: హుబ్లీ–ధార్వాడ నూతన పోలీస్‌ కమిషనర్‌గా భూషన్‌ గులాబ్‌ రావ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న శశికుమార్‌ బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో భూషన్‌ గులాబ్‌ రావ్‌ నియమితులయ్యారు. కర్ణాటక కేడర్‌ 2009 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి భూషన్‌.. బెళగావి నగర పోలీస్‌ కమిషనర్‌గా పని చేస్తూ ఇక్కడకి బదిలీ అయ్యారు.

పల్లకీలో ఊరేగిన

హయ్యాళ లింగేశ్వరుడు

రాయచూరు రూరల్‌: యాదగిరి జిల్లా వడిగేర తాలూకా హయ్యాళలో ఆదివారం హయ్యాళ లింగేశ్వర స్వామి పల్లకీ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వందలాది మంది భక్తులు హయ్యాళ లింగేశ్వరడుని పూలతో అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. అనంతరం కృష్ణా నదికి ఊరేగింపుగా తీసుకెళ్లి గంగా జలంతో అభిషేకం చేశారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

కొప్పళ ఎస్పీగా సాహిల్‌ బాగ్లా

రాయచూరు రూరల్‌: బెంగళూరు ఈస్ట్‌ ట్రాఫిక్‌ విభాగం డీసీపీగా పని చేస్తున్న సాహిల్‌ బాగ్లాను కొప్పళ జిల్లా నూతన పోలీస్‌ సూపరింటెండెంట్‌గా (ఎస్పీ) నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత రెండేళ్లుగా కొప్పళ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించిన డా.రామ్‌ లక్ష్మణ్‌ అరసిద్దిని బదిలీ చేశారు. ఈయన్ను బెంగళూరులోని ప్రధాన కార్యాలయానికి పంపించారు.

రాఘవేంద్ర స్వామి

అనుగ్రహ అవార్డుల ప్రదానం

రాయచూరు రూరల్‌: మంత్రాలయంలో శనివారం రాత్రి రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు, సప్తరథోత్సవాలు జరిగాయి. మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీ పాదంగల్‌ మఠంలో పూర్వారాధన చేపట్టారు. సంస్కృతి విద్యా పీఠం ప్రిన్సిపాల్‌ విద్వాన్‌ వాదిరా రాజాచార్‌, తంజావూర్‌ విశ్వ విద్యాలయం వైస్‌ చాన్సలర్‌ వైద్య సుబ్రమణ్యంకు రాఘవేంద్ర స్వామి అనుగ్రహ అవార్డులు ప్రదానం చేశారు. ఉత్సవాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేష్‌, తెలంగాణ, గోవా, కేరళ, పాండిచ్చేరి నుంచి భక్తులు పాల్గొన్నారు. అంతకుముందు మంచాలమ్మ దేవిని ఊరేగించారు.

ఐఏఎస్‌కు కస్టడీ

బనశంకరి:కేపీఎస్‌సీ పశువైద్యాధికారుల పోస్టుల భర్తీ కుంభకోణంలో ఐఏఎస్‌ అధికారి జ్ఞానేంద్ర కుమార్‌ గంగ్వార్‌కు బెంగళూరు 1వ ఏసీజేఎం కోర్టు జుడిషియల్‌ కస్టడీకి ఆదేశించింది. శనివారం 11 గంటల నుంచి సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నట్లు తెలిపి కోరమంగలలో జడ్జి ఇంట్లో హాజరు పరిచారు. వాదనలు ఆలకించి జుడిషియల్‌ కస్టడీకి ఆదేశించడంతో జైలుకు తరలించారు. సోమవారం మళ్లీ కోర్టులో హాజరుపరుస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement