మానవీయ విలువలు పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

మానవీయ విలువలు పెంపొందించాలి

Aug 31 2026 1:56 AM | Updated on Aug 31 2026 1:56 AM

రాయచూరు రూరల్‌: సమాజంలో విద్యార్థులకు ఉత్తమ బోధనను అందించడంతో పాటు, వారిలో మానవీయ విలువలను పెంపొందించేలా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యేలు బసనగౌడ దద్దల్‌, బోసురాజు పిలుపునిచ్చారు. స్థానిక పండిత సిద్ధరామ జంబలదిన్ని రంగమందిరంలో కురుబ సమాజం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న విలక్షణమైన ప్రతిభను గుర్తించి, వారి ఉన్నతికి విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందించాలన్నారు. కార్యక్రమంలో శాసన సభ్యులు వసంత కుమార్‌, శివరాజ్‌ పాటిల్‌, లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్‌, ప్రముఖులు వినయ్‌ కుమార్‌, గుండప్ప, హన్మంతప్ప, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement