మండ్య: శ్రీ రాఘవేంద్ర గురుసార్వభౌమ 355వ ఆరాధన మహోత్సవాలు ఆదివారం అంతటా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మండ్య నగరంలోని శ్రీ వ్యాసరాజ మఠం ఆవరణలో గల శ్రీరాఘవేంద్ర స్వామి ఆలయంలో విశేష పూజా వేడుకలు జరిగాయి. మధ్యాహ్న ఆరాధన, పాదపూజ, అష్టోత్తర సహిత పంచామృత అభిషేకం, ఆపై గురుసార్వభౌమర్ల పాలక్కి ఉత్సవం, మహారథోత్సవం కనులపండువగా జరిపించారు. నేత్రపర్వంగా కనకాభిషేకం సాగింది. భక్తి గానసుధ, భజనలు వీనులవిందు చేశాయి.
భక్తిశ్రద్ధలతో మధ్యారాధన
కోలారు: నగరంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో మధ్యారాధన ఘనంగా జరిగింది. ఉదయం రాయర బృందావనానికి పంచామృత అభిషేకం జరిపి వివిధ పూలహారాలతో ముస్తాబు చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు బృందావనం దర్శనం చేసుకున్నారు.
బెంగళూరు మఠంలో
బనశంకరి: ఉద్యాననగరిలో జయనగర ఐదో బ్లాక్‌లోని శ్రీ గురు రాఘవేంద్రస్వామి మఠంలో ఆరాధన ఉత్సవాల్లో ఆదివారం రాయల గురు రాఘవేంద్రులకు వాదీంద్ర ఆచార్య నేతృత్వంలో పాదపూజ, కనకాభిషేకం నిర్వహించారు. బంగారు, నవరత్నాలతో కూడిన రాఘవేంద్రస్వామి విగ్రహాన్ని బృందావనంలో ప్రతిష్టించి పూజించారు. అనేకమంది ప్రముఖులతో పాటు వేలాదిగా భక్తులు పాల్గొన్నారు.
ఘనంగా ఆరాధన వేడుకలు


