భక్తిశ్రద్ధలతో భంభం బాబా దీక్షల విరమణ
సాక్షి,బళ్లారి: మైసూరు సర్వధర్మ ఆశ్రమ సంస్థాపకులు భం అన్వరానందబాబా ప్రారంభించిన భంభంబాబా దీక్షల పరంపర ప్రస్తుతం మైసూరు సర్వధర్మ ఆశ్రమ పీఠాధిపతి భం కబీర్ కిరణ్ స్వామీజీ ఆధ్వర్యంలో భంభంబాబా దీక్షలు ముగిశాయి. బుధవారం భంభం బాబా దీక్షాపరులు భక్తిశ్రద్ధలతో దీక్షాకంకణాలను తొలగించి, పంచామృతం తీసుకుని, ఊరేగింపుగా వెళ్లి చెరువులు, బావులు, నదుల్లోని నీటిలో వదిలేశారు. బళ్లారితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దీక్షలు తీసుకున్న వారు ఆంధ్రాళ్ భంభం బాబా సేవా సమితిలో ప్రత్యేక పూజలు, భజనలు చేసి, భంభం స్వామి చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. అలాగే మైసూరు సమీపంలోని సర్వధర్మ ఆశ్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి దీక్షలను విరమించి, సమీపంలోని కావేరి నదిలో దీక్షాకంకణాలను వదిలారు. మూడు రాష్ట్రాల పరిధిలో పెద్ద సంఖ్యలో భంభంబాబా దీక్ష తీసుకున్న భక్తులు ఆయా సేవా సమితుల పరిఽధిలో ప్రత్యేక పూజలు, భజనలు చేసి, దీక్ష విరమించారు.
21 రోజుల పాటు కఠిన నియమాలతో దీక్షలు ఆచరించిన భక్తులు


