గాలిపటం దారం గొంతుకు చిక్కి ఒకరి మృతి
హుబ్లీ: గాలిపటం దారం గొంతుకు చుట్టుకుని ఒకరు మృతి చెందిన ఘటన బీదర్ తాలూకా బొబ్బళగి గ్రామంలో హైవే– 65లో నిర్ణా క్రాస్ వద్ద బుధవారం ఉదయం చోటు చేసుకుంది. సదరు గ్రామ నివాసి సంజీవ్ కుమార్ బైక్‌లో వెళుతుండగా చైనా మాంజా గాలి పటం దారం కనిపించక పోవడంతో అలాగే దూసుకెళ్లగా నేరుగా ఆయన గొంతును చుట్టేసింది. దీంతో వేగంతో వెళుతున్న ఆయన తీవ్రంగా గాయపడగా బైక్ నుంచి రోడ్డు మీద పడిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడని ఆ జిల్లా ఎస్పీ ప్రదీప్ గుంటి తెలిపారు. మృతుడు లారీ క్లీనర్‌గా పని చేసేవాడు. హాస్టల్ ఉన్న కుమార్తెను ఇంటికి తీసుకెళ్లడానికి వెళుతుండగా మృత్యువు వెంటాడింది. ఘటనపై మన్నా–ఎ ఖెళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


