లాల్‌బాగ్‌లో ఫ్లవర్ షో షురూ
ప్రదర్శనను వీక్షిస్తున్న డీసీఎం శివకుమార్
తిలకిస్తున్న సందర్శకులు
బనశంకరి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరు లాల్‌బాగ్ గ్లాజ్‌హౌస్‌లో ఫలపుష్ప ప్రదర్శన బుధవారం సాయంత్రం నుంచి ఆరంభమైంది. డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, మంత్రులు ఎస్‌ఎస్.మల్లికార్జున్, రామలింగారెడ్డి ప్రారంభించారు. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో దివంగత సాహితీవేత్త పూర్ణచంద్ర తేజస్వి జీవితం, రచనల స్ఫూర్తితో తేజస్వి విస్మయ పుష్ప థీమ్‌ను తీర్చిదిద్దారు. జనవరి 26వ తేదీ వరకు ఫ్లవర్ షో కొనసాగుతుంది. బిళిగిరిరంగన బెట్ట గ్రామీణ నేపద్యం, జానపద కళలు, నందిగిరిధామ ప్రకృతి అందాలతో పాటు వివిధ పుష్ప ఆకృతులు ఆకర్షిస్తాయి.
లాల్‌బాగ్‌లో ఫ్లవర్ షో షురూ


