కొనసాగుతున్న ఐపీల తంతు
సాక్షి,బళ్లారి/బళ్లారి అర్బన్: నగరంలో ఇటీవల ప్రజలను చీటీల పేరుతో రెట్టింపు డబ్బులు ఇస్తామని నమ్మబలికి మోసం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటంతో నగరంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బంగారు వ్యాపారులు పెద్ద ఎత్తున మోసాలు చేసి, ప్రజలకు కుచ్చుటోపి పెట్టిన సంగతి మరవక ముందే నగరంలోని హవంబావికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి కోట్లాది రూపాయలు ప్రజల నుంచి చీటీలు కట్టించుకుని అదృశ్యమయ్యారు. దీంతో బాధితులు 10 రోజుల నుంచి ఆయన కనబడకపోవడంతో మంగళవారం బ్రూస్‌పేట పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన అనంతరం ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి వినతిపత్రం అందజేశారు. తమను నమ్మించి, మోసం చేసి చీటీలు కట్టించుకున్నారని, పెద్ద ఎత్తున నగదు కాజేసి ఐపీ పెట్టారని, వెంకటేశ్‌ను వెతికి పట్టుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భయాందోళనలో నగర వాసులు
ప్రజలకు మోసం చేసి వెంకటేశ్ పరారీ
పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు


