యువకుడు ఆత్మహత్య
కెలమంగలం: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడు. వివరాల మేరకు తాలూకా కేంద్రం డెంకణీకోట కిద్వాయ్ వీధికి చెందిన చిన్నరాజ్ కుమారుడు హేరామ్ (26) రెండు రోజుల క్రితం ఇంట్లో ఉన్నట్లుండి స్పృహ కోల్పోయి కిందపడ్డాడు. విషయం గమనించిన బంధువులు చికిత్స కోసం డెంకణీకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన డాక్టర్లు పురుగుల మందు తాగాడని తెలిపారు. మెరుగైన చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స ఫలించక హేరామ్ ఆదివారం రాత్రి చనిపోయాడు.
ట్రాఫిక్ రూల్స్‌ని పాటించాలి
హోసూరు: క్రిష్ణగిరిలోని ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులతో సైబర్ క్రైం డీఎస్పీ నరసింహన్ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా ర్యాలీ జరిగింది. బైకిస్టులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, మద్యం సేవించి, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని తెలిపారు. రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.


