ప్రతి విద్యార్థి ప్రతిభావంతుడే
బళ్లారి రూరల్: ప్రతి మనిషిలో 8 జ్ఞానపీఠ అవార్డులు పొందే ప్రతిభ దాగి ఉంటుందని గదగ్ విజయపుర రామకృష్ణ ఆశ్రమం ప్రముఖుడు స్వామి నిర్భయానంద సరస్వతి తెలిపారు. సోమవారం బీఎంసీఆర్‌సీలోని బీసీ రాయ్ ఆడిటోరియంలో యూత్ డే సందర్భంగా వైద్య విద్యార్థులకు ఏర్పాటు చేసిన సంవాదన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రతి విద్యార్థి అంతర్గతంగా ప్రతిభావంతులే. ప్రతిభను గుర్తించి వెలుగులోకి తెస్తే ఉన్నతిని సాధించవచ్చని తెలిపారు. వైద్య విద్యార్థుల ఆత్మహత్యల గురించి విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారు. తల్లిదండ్రులు చదువుల విషయంలో స్వేచ్ఛను ఇవ్వాలి. పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో బీఎంసీఆర్‌సీ డైరెక్టర్ డాక్టర్ గంగాధరగౌడ, డాక్టర్లు పాల్గొన్నారు.


