నగర పరిశుభ్రతకు అందరూ సహకరించండి
రాయచూరు రూరల్ : నగర పరిశుభ్రతకు అందరూ సహకరించాలని లోక్‌సభ సభ్యుడు జీ.కుమార నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో నగరసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మారథాన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నగరంలో పరిశుభ్రతకు తోడు పర్యావరణ సంరక్షణ, నగర సుందరీకరణకు యువత నడుం బిగించాలన్నారు. మారథాన్‌ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగరం పెరుగుతున్న కొద్దీ ప్రజలు పరిశుభ్రతపై మొగ్గు చూపాలని కోరారు. ర్యాలీలో జిల్లాధికారి నితీష్, ఎస్పీ అరుణాంగ్షు గిరి, ఏడీసీ శివానంద, ఏసీ హంపణ్ణ, నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో, జయన్న, రవి, సురేంద్రబాబు తదితరులున్నారు.


