భక్తిమార్గంలో భగవత్ దర్శనం
రాయచూరు రూరల్ : భక్తి మార్గంలో భక్తులకు భగవంతుడిని చూపించిన మహాన్ వ్యక్తి గోపాల్‌దా్‌స్ అని శ్రుతి సాహిత్య సమ్మేళనం అధ్యక్షుడు మురళీధర్ కులకర్ణి పేర్కొన్నారు. ఆదివారం జవహర్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో గోపాల్‌దాస్ మధ్యారాధన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో భక్తి, ధర్మం, దానం అనే పదాలను గురించి సంకీర్తనల్లో ఆనాడే వివరించారని అన్నారు.
రోడ్డు పనులకు భూమిపూజ
బళ్లారిఅర్బన్: నగరంలోని 5వ వార్డు కాకర్లతోటలో రోడ్డు పనులకు సోమవారం సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి భూమిపూజ చేశారు. పీడబ్ల్యూడీ ఆర్టీ ఇండెంట్ కింద సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో కాకర్లతోట– ముండరిగి– మించేరి వైపు వెళ్లే ఎండీఆర్ రోడ్డు పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు, మేయర్ పూజారి గాదెప్ప యాదవ్, ఏపీఎంసీ అధ్యక్షుడు నాగేంద్ర, 5వ వార్డు కార్పొరేటర్ రాజశేఖర్, కాకర్లకోట సూరి, కేసీ వెంకటేష్, హగరి గోవిందు, హొన్నప్ప, కాంట్రాక్టర్ హనుమన గౌడ, కాంగ్రెస్ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా బసవలింగ రథోత్సవం
రాయచూరు రూరల్: జిల్లాలోని మాన్వి తాలూకా ఉటకనూరులో బసవలింగ దేశికేంద్ర జాతర, రథోత్సవాన్ని ఆదివారం సాయంత్రం వందలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. శాంతమల్ల శివాచార్య, సిద్దరామేశ్వర స్వామీజీ తదితరులు పాల్గొని రథోత్సవాన్ని ప్రారంభించారు.
పుస్తక పఠనంతో
సమసమాజ నిర్మాణం
రాయచూరు రూరల్: సమసమాజ నిర్మాణానికి మానవుడు పుస్తకాలు చదవాలని, స్వార్థం విడనాడాలని సీనియర్ కవి రుద్రప్ప పేర్కొన్నారు. ఆదివారం కన్నడ భవనంలో కన్నడ సాహిత్య పరిషత్ కురిడి రాసిన బిసిలు బసద కుసుమ పుస్తకాన్ని విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేడు ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదివినప్పుడే అందులో ఉన్న విషయాలు, ద్వేషం, కక్ష, అసూయల గురించి అవగతం అవుతుందన్నారు. సామాజిక, విద్యా, సంగీత రంగాలకు సేవలను పెంచాలన్నారు. కార్యక్రమంలో కసాప అధ్యక్షుడు విజయ రాజేంద్ర, వీర హనుమాన్, నాగప్ప, మహేంద్ర కుర్డి, వైశాలి, దేవేంద్రమ్మ, రేఖ, బాబు భండారీగళ్, దండెప్ప బిరాదార్, రావుత్ రావ్, ఖాన్ సాబ్ మోమిన్‌లున్నారు.
కలబుర్గి జిల్లాలో సీఎం, డీసీఎం పర్యటన
రాయచూరు రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ సోమవారం కలబుర్గి జిల్లాలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కలబుర్గి, సేడం, యడ్రామి, జేవర్గిలో రూ.867.49 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి భూమిపూజ చేశారు. యడ్రామిలో రూ.38.367 కోట్లు, సేడంలో రూ.110.35 కోట్లతో పనులను ప్రారంభించారు. కార్యక్రమాల్లో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే, మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, శాసన సభ్యులు అజయ్ సింగ్, ఖనీజా ఫాతిమా, అల్లమప్రభు పాటిల్, తిప్పణ్ణ కమకనూరులున్నారు.
గాయత్రి భవన్
నిర్మాణానికి నిధులివ్వండి
రాయచూరు రూరల్: నగరంలో గాయత్రి భవన్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని అఖిల కర్ణాటక బ్రాహ్మణ సమాజం సంచాలకుడు నరసింగరావ్ డిమాండ్ చేశారు. సోమవారం లోక్‌సభ సభ్యుడు కుమార్ నాయక్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. నగరంలోని సిద్దనాథ కాలనీలో విధాన పరిషత్ సభ్యుడి రూ.25 లక్షలతో భవన నిర్మాణాలు చేపట్టారన్నారు. పాత జిల్లా కావడంతో అన్ని వర్గాల ప్రజలకు తగ్గట్లు మౌలిక సౌకర్యాల కల్పనకు నిధులు కేటాయించాలన్నారు. వెంకట కృష్ణన్, అరవింద్ కులకర్ణి, రమేష్ కులకర్ణి, అనిల్, శ్రీనివాస్, హనుమేష్, ప్రవీణ్, రామారావ్‌లున్నారు.
భక్తిమార్గంలో భగవత్ దర్శనం
భక్తిమార్గంలో భగవత్ దర్శనం


