దక్షిణ కాశీలో పర్యాటకుల సందడి
● హంపీకి భారీగా
పోటెత్తిన సందర్శకులు
● స్మారకాల అందాలు వీక్షించి తన్మయత్వం
హొసపేటె: సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో దక్షిణ కాశీ హంపీకి స్థానికులతో పాటు మహారాష్ట్ర, ఆంఽఽధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వంటి ఇరుగు పొరుగు, వివిధ రాష్ట్రాల నుంచి విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హంపీకి వచ్చిన భక్తులు మొదట హంపీలోని విరుపాక్షేశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. తరువాత వారు హంపీలో ఉన్న ఎదురు బసవన్న, సాసివెకాళు గణపతి, బడవిలింగ, భూగర్భ శివాలయం, కమల్ మహల్, మహానవమి దిబ్బ, రాణి స్నాన మందిరం, సప్త స్వర స్తంభాలు, విజయ విఠల దేవస్థానం, ఏకశిలా రథం, హజార రామ ఆలయం, ఎలిఫెంట్ హౌస్, యంత్రోద్ధారక గణపతితో పాటు వివిధ స్మారక చిహ్నాలను వీక్షించడం ద్వారా హంపీలోని స్మారకాల అందాలను ఆస్వాదించారు.
దక్షిణ కాశీలో పర్యాటకుల సందడి


