మార్చిలో వర్కింగ్ జర్నలిస్టుల సమ్మేళనం
రాయచూరు రూరల్: 2026 మార్చి నెలలో బీదర్‌లో 40వ వర్కింగ్ జర్నలిస్టుల సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు శివానంద తగడూరు వెల్లడించారు. ఆదివారం బీదర్ జిల్లా పాత్రికేయుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. బీదర్ జిల్లాలోని పాత్రికేయులు ఐకమత్యంతో సమ్మేళనం విజయవంతానికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర నలు మూలల నుంచి వచ్చే ప్రతినిధులకు మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. సమావేశంలో బీదర్ జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు దేవప్ప, ఇతర సభ్యులున్నారు.
అశ్లీల మెసేజ్‌లు,
వరకట్న వేధింపులు
● వీడెక్కడి పోలీస్ భర్త అంటూ
భార్య ఆవేదన
హుబ్లీ: అశ్లీల మెసేజ్‌లు, వరకట్న వేధింపులకు గురి చేస్తున్న భర్తపై వీడెక్కడి పోలీస్ భర్త అంటూ భార్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్త అయిన పోలీస్ కానిస్టేబుల్‌పై తాను పని చేసే బీదర్‌లో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు చర్యలు తీసుకోలేదు. సంతానం కాలేదని వరకట్నం తేవాలంటూ భర్త డిమాండ్ చేస్తున్నాడు. అంతేగాక ప్రాణాలు తీస్తానని కూడా బెదిరిస్తున్నాడని ఆమె పేర్కొంటూ తగిన రక్షణ కల్పించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. వరకట్నం తేక పోతే అక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. గతంలో ఔరాద్ తాలూకాలో చింతాకి స్టేషన్‌లో కేసు నమోదైంది. తాజాగా బీదర్ మైకో లేఅవుట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా స్పందన లేదని, తనకు న్యాయం కల్పించాలని ఆమె పోలీసులకు ఫిర్యాదులో విన్నవించారు.
కత్తిపోటుకు వ్యక్తి బలి
తుమకూరు: తుమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి తాలూకా హుళియారు హోబ్లిలోని కెంకెరె గ్రామానికి చెందిన మంజునాథ్‌ను ఆదివారం రాత్రి దుండగులు కత్తులతో పొడిచి చంపారు. వివరాలు.. మంజునాథ్ షామియానా, అలంకరణ పనులతో పాటు కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బకాయప్ప గుడ్లు సమీపంలో కొత్తగా నిర్మించిన ‘రాయర మనె‘ ఇంట్లోకి ప్రవేశించిన ఐదుగురు వ్యక్తులు మంజునాథ్‌పై కత్తులతో దాడి చేశారు. గమనించిన స్థానికులు మంజునాథ్‌ను చికిత్స కోసం హుళియారు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. హుళియారు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
మార్చిలో వర్కింగ్ జర్నలిస్టుల సమ్మేళనం


