యువతకు వివేకానంద ఆదర్శప్రాయుడు
రాయచూరు రూరల్: నేటి సమాజంలో యువకులు వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని సోమవారపేటె మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య పేర్కొన్నారు. సోమవారం నగరంలోని వివేకానంద సర్కిల్‌లో వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి స్వామీజీ ప్రసంగించారు. నగరంలోని మహాత్మ గాంధీ క్రీడా మైదానంలో రాయచూరు ఉత్సవాల సందర్భంగా జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా మారధాన్ పరుగును ప్రారంభించి మాట్లాడారు. ఉత్తమ సమాజ సేవలందించిన మహోన్నత వ్యక్తి వివేకానందని సేవలు మరపురానివన్నారు. కార్యక్రమంలో రాకేష్ రాజలబండి, సురేష్, బీకే దేశాయి, బిరాదార్‌లున్నారు.
ప్రచారంతో చికాగో ప్రసంగం వెలుగులోకి
హుబ్లీ: ఉత్తర కర్ణాటకలోని హుబ్లీ–ధార్వాడ జంట నగరాలు, వివిధ జిల్లాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంఘ సంస్థల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువజనోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కుందగోళలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంశి కేఎల్‌ఈ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ అత్తిగేరి మాట్లాడుతూ స్వామి వివేకానంద ఆదర్శాలను, స్పూర్తిదాయక ప్రసంగాలను యువత అలవరుచుకోవాలన్నారు. డీసీ, ఏసీ, జెడ్పీ, తహసీల్దార్ కార్యాలయాలతో పాటు సంఘ సంస్థల ఆధ్వర్యంలో కూడా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన ఆదర్శాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం జనవరి 12ను యువజన దినోత్సవంగా ప్రకటించిందన్నారు. కొప్పళ జిల్లా కేంద్రంలో జిల్లాధికారి, జెడ్పీ సీఈఓ, ఎంపీ రాజశేఖర్ హిట్నాళ్, ఎమ్మెల్యే రాఘవేంద్ర హిట్నాళ్, ఇతర సంఘం సంస్థల ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ యువత సరికొత్త నైపుణ్యాలను ముఖ్యంగా కృత్రిమ మేధను అంది పుచ్చుకొని ప్రపంచ విజ్ఞాన రంగంలో భారతీయ యువత తమదైన శైలిలో రాణించాలన్నారు. గంగావతిలోని ఓ ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో యజమాన్యం వివేకానంద జయంతి వేడుకల వేళ చిన్నారులకు వివేకానంద చరిత్రపై పిల్లలకు అవగాహన కల్పించారు.
యువతకు వివేకానంద ఆదర్శప్రాయుడు


