
నాగదేవా.. పూజలందుకోవా
● భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి
తుమకూరు: శ్రావణమాసంలో పరమ పవిత్రమైన నాగుల చవితి పర్వదినాన్ని అంతటా భక్తిశ్రద్ధలతో ఆచరించారు. మహిళలు మంగళవారం ఉదయం నుంచి నాగులకట్టలకు వెళ్లి పాలు పోసి నైవేద్యం సమర్పించి పూజలు చేశారు. నాగుల కట్టలను, విగ్రహాలను పుష్పహారాలతో అలంకరించారు. తుమకూరు కోడిబసవన్న ఆలయం వెనుక అమానికెరెలోని నాగుల రాళ్లు, పుట్టలకు విశేష పూజలు చేశారు. నాగదోషాల నుంచి విముక్తిని ప్రసాదించాలని ప్రార్థించారు. బెంగళూరులోని రామేశ్వర ఆలయంలో నాగుల విగ్రహాలను పూజించారు.