
అద్దం తగలడంపై లారీ డ్రైవర్ ఆగ్రహం
హొసపేటె: ప్రైవేట్ బస్సు మినీ లారీ సైడ్ మిర్రర్‌ను తాకడంతో ఆగ్రహించిన లారీ డ్రైవర్ బస్సు డ్రైవర్‌పై పొడవైన కర్రతో దాడికి యత్నించిన ఘటన విజయనగర జిల్లా హొసపేటె తాలూకా చిలకనహట్టి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి– 50లో మంగళవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో జరిగింది. బెంగళూరు నుంచి రాయచూరుకు ఒక ప్రైవేట్ బస్సు వెళుతోంది. ఆ సమయంలో బస్సు డ్రైవర్ లారీని ఓవర్ టేక్ చేస్తూండగా బస్సు లారీ అద్దాన్ని తాకింది. దీంతో కోపోద్రీక్తుడైన లారీ డ్రైవర్ బస్సు డ్రైవర్‌ను అడ్డుకుని కొడవలితో నరికివేస్తానని బెదిరించాడు. మినీ లారీ డ్రైవర్ అవాజ్ పొడవైన కర్ర పట్టుకుని బస్సు డ్రైవర్‌పై దాడి చేయడాన్ని స్థానికులు మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించారు. తరువాత ఈ సంఘటన గురించి ఎస్పీ జాహ్నవికి సమాచారం ఇచ్చారు. నిందితుడు యమనప్పను మరియమ్మనహళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ౖ ప్రైవేట్ బస్సు డ్రైవర్‌పై దాడికి యత్నం