
పంచ గ్యారెంటీలతో మహిళా సబలీకరణ
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంచ గ్యారెంటీల అమలుతో మహిళలు సబలీకరణ చెందారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌమ్యారెడ్డి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ప్రైవేట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సర్కార్ అమలు చేసిన పంచ గ్యారెంటీల అమలుపై ఉపన్యసించారు. త్వరలో జరగనున్న జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో పార్టీ మద్దతుదారుల విజయానికి కార్యకర్తలు కలిసికట్టుగా సైనికుల్లా పని చేయాలన్నారు. సమావేశంలో మహిళా జిల్లాధ్యక్షురాలు నిర్మల, శశికళ, జ్యోతి, శ్రీదేవి, నాగవేణి, ప్రతిభారెడ్డి, మంజుల, సురేఖ, చంద్రకళ, ఇందిర, మాల భజంత్రి తదితరులున్నారు.