
భూ యజమానులపై దాడి తగదు
రాయచూరు రూరల్: భూ యజమానులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయడంలో పోలీసులు విఫలం అయ్యారని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు మహంతేష్ కుమార్ మిత్ర ఆరోపించారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయచూరు తాలూకా గారలదిన్నిలో సుభద్రాదేవికి చెందిన సర్వే నంబర్ 308, 311, 312లలో 623 ఎకరాల భూమిని కొంత మంది లీజ్‌కు తీసుకొని వ్యవసాయం చేసేవారన్నారు. నేడు వారికి లీజుకు ఇవ్వక పోవడంతో భూముల్లోకి ఇతర యజమానులను వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఈ విషయంలో గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ వారికి మద్దతు ఇస్తూ యరగేర సీఐ నింగప్ప, ఎస్‌ఐలకు కేసు నమోదు చేయరాదని ఆదేశించడాన్ని తప్పుబట్టారు. భూముల్లోకి వెళితే తమపై దాడులు చేస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని వారు ఎస్పీని కోరారు.