
చెత్త వాహనం ఢీకొని బాలుడు దుర్మరణం
● బాపూజీ నగర్‌లో విషాదం
సాక్షి,బళ్లారి: నగరంలో ప్రతిరోజు ఇంటింటా చెత్త సేకరణ చేసే వాహనం ఢీకొని ఓ బాలుడు మృతి చెందడంతో నగరంలో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం నగరంలోని బాపూజీ నగర్‌లోని సమర, శైలజ దంపతుల కుమారుడు విక్కీ(2) అనే చిన్నారి ఆడుకుంటుండగా, వచ్చిన చెత్త సేకరణ వాహనం ఢీకొనడంతో చిన్నారి విక్కీ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఏపీఎంసీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఘనంగా కార్గిల్ విజయోత్సవం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని హాలసాగర గ్రామంలో కార్గిల్ విజయోత్సవ వేడుకను వీర సైనికుడు డి.కుమారస్వామి స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి జరుపుకున్నారు. బీజేపీ తాలూకా అధ్యక్షుడు బణవికల్లు నాగరాజ్ మాట్లాడుతూ భారత సైనికులు కార్గిల్ యుద్ధంలో ధైర్యంగా పోరాడి మన దేశ గౌరవం కాపాడారని అన్నారు. వారి త్యాగం, నిస్వార్థత కచ్చితంగా భారతీయులందరికీ ఒక వెలుగు దీపం. సైనికులుగా పని చేసి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా వారి ఉత్సాహం, దేశం పట్ల ప్రేమ తగ్గక పోవడం ప్రశంసనీయం. మాజీ సైనికుల సంఘం జిల్లా అధ్యక్షుడు కాటర్ రమేష్, మండల ప్రధాన కార్యదర్శి పీ.మంజునాథ్, మంగాపుర సిద్దేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సచిన్‌కుమార్, యువ మోర్చా అధ్యక్షుడు మొరబ అజయ్, తాలూకా ప్రధాన కార్యదర్శి భరత్ రామ్ తదితరులు పాల్గొన్నారు.

చెత్త వాహనం ఢీకొని బాలుడు దుర్మరణం