
ఆగస్టు 6న హట్టికి సీఎం రాక
● అభివృద్ధి పనులకు శ్రీకారం
చుట్టనున్న వైనం
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా హట్టికి ఆగస్ట్ 6న ముఖ్యమంత్రి సిద్దరామయ్య వస్తారని హట్టి బంగారు గనుల కంపెనీ అధ్యక్షుడు జీ.టీ.పాటిల్ తెలిపారు. మంగళవారం హట్టి బంగారు గనుల కంపెనీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. హట్టి బంగారు గనుల కంపెనీ సిబ్బందికి, కార్మికులకు నూతన వసతుల నిర్మాణ పనులకు భూమిపూజ చేస్తారన్నారు. సమావేశానికి 15 వేల మంది ప్రజలు హాజరవుతారని, ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ప్రజలు, కార్మికులు, రైతుల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్సీలు శరణేగౌడ బయ్యాపూర్, వసంత్ కుమార్, శాసన సభ్యులు వజ్జల్ మానప్ప, మాజీ ఎమ్మెల్యే హొలిగేరి, జిల్లాధికారి నితీష్, ఎస్పీ పుట్టమాదయ్య, ఏసీ బసవణ్ణప్ప, ఎండీ శిల్పాలున్నారు.
రైతు ఆత్మహత్య
బళ్లారిఅర్బన్: తాలూకాలో మరో రైతన్న అప్పుల బాధలకు బలయ్యాడు. తాలూకాలోని కప్పగల్ గ్రామానికి చెందిన రైతు పీ.వీరారెడ్డి(45) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

ఆగస్టు 6న హట్టికి సీఎం రాక