
ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్‌కు నివాళి
బళ్లారిఅర్బన్: వెట్టిచాకిరీ కాలంలో అజ్ఞానం, మూఢత్వం అనే అంధకారంలో మునిగి తేలుతున్న భారత దేశానికి ఆధునిక పరిజ్ఞాన వెలుగులను అందించిన ధర్మ నిరుపేక్ష మానవతావాది ఈశ్వర్‌చంద్ర విద్యాసాగర్ అని ఏఐడీఎస్‌ఓ బళ్లారి జిల్లా అధ్యక్షుడు కే.ఈరణ్ణ పేర్కొన్నారు. విమ్స్ మైదానంలో ఈశ్వరచంద్ర వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చదువుకు నోచుకొని మహిళలు, అట్టడుగు వర్గాలకు విద్యాబోధన అందించడంలో, చిరు ప్రాయంలో వితంతువులుగా మారి నరక ప్రాయమైన ఆడపిల్లలకు పునర్వివాహం చేసేలా శ్రమించారు. అంతేగాక పురాతన సంప్రదాయాలను రూపుమాపి కొందరు సమాజ పెద్దలకు కూడా ఆయన తమదైన రీతిలో విప్లవ ఉద్యమం సృష్టించారన్నారు. అన్ని మూఢ విశ్వాసాలను పారదోలినప్పుడే విద్యాసాగర్‌కు నిజమైన గౌరవం ఇచ్చినట్లని అన్నారు. ఏఐడీఎస్‌ఓ ప్రముఖులు మహంతేష్, తిప్పేస్వామి, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.