త్రినేత్రాయ నమః | - | Sakshi
Sakshi News home page

త్రినేత్రాయ నమః

Jul 29 2025 8:16 AM | Updated on Jul 29 2025 8:16 AM

త్రిన

త్రినేత్రాయ నమః

చింతామణి: శ్రావణ మాస మొదటి సోమవారం సందర్భంగా పట్టణంలోని ఎన్‌ఎన్‌టీ రోడ్డులో వెలసిన పురాతన శ్రీ నాగనాథేశ్వర స్వాముల వారికి విశేష పూజలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు తండోపతండాలుగా వచ్చి త్రినేత్రున్ని దర్శించుకొని పూజలు చేశారు. పండితులు నాగేంద్ర బృందం పూజలు, హోమాలను నెరవేర్చారు.

15 బైక్‌లు బుగ్గి

బనశంకరి: బెంగళూరులోని హలసూరు మార్కెట్‌ వద్ద అగ్నిప్రమాదం సంభవించి 15 బైకులు దగ్ధమయ్యాయి. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో స్థానిక నివాసులు రోడ్డు పక్కన నిలిపిన బైకులకు నిప్పు అంటుకోవడంతో కాలిపోయాయి. మార్కెట్‌లోని కాళియమ్మన్‌ గుడి కూడా దెబ్బతింది. ఓ కూరగాయల దుకాణం కూడా మంటలు వ్యాపించి కాలిపోయింది. ఎవరో అల్లరిమూకలు కావాలనే నిప్పంటించాయని ప్రజలు ఆరోపించారు. అక్కడి సీసీ కెమెరాలలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరించినట్లు కనబడింది.

సోడా పొడిని చూపి

డ్రగ్స్‌ అని బెదిరింపు

హనీట్రాప్‌ ముఠా అరెస్టు

బనశంకరి: హనీట్రాప్‌ పేరుతో దోపిడీకి పాల్పడుతున్న గ్యాంగ్‌ను యలహంక ఉప నగర పోలీసులు అరెస్టు చేశారు. శరణబసప్ప, రాజు మానె, శ్యామ్‌సుందర్‌, అబిషేక్‌, బీర్‌బల్‌, సంగీత అనే ఆరుమంది నిందితులు. ఇటీవల రాకేశ్‌రెడ్డి అనే యువకున్ని నిందితురాలు సంగీత హనీ ట్రాప్‌ చేసి, తన ముఠా ద్వారా రూ.2 లక్షలు దోచుకుంది. పరిచయం అయ్యాక రాకేశ్‌రెడ్డిని సంగీత రూమ్‌కు తీసుకెళ్లి సంగీత మద్యం తాగించింది. ఈ సమయంలో మిగిలిన దోపిడీదారులు రూమ్‌లోకి చేరుకుని మీరు డ్రగ్స్‌ పార్టీ చేస్తున్నారా అంటూ బెదిరించారు. సంగీత బ్యాగులో ఉండే బేకింగ్‌ సోడాను చూపించి ఇది కొకై న్‌ కదా, డ్రగ్స్‌ సేవిస్తున్నారా అని రాకేశ్‌రెడ్డిని భయపెట్టారు. పోలీసులకు పట్టిస్తామని బెదిరించారు. రాకేశ్‌రెడ్డి నుంచి నగదు వసూలు చేసి పంపించారు. తరువాత బాధితుడు యలహంక ఉపనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు తీవ్రంగా గాలించి సోమవారం 6 మంది దోపిడీదారులను అరెస్ట్‌ చేశారు. ఈ ముఠా అనేకమందిని ఈ తరహాలో బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం.

నదిలో కొడుకు గల్లంతు,

చెరువులోకి దూకిన తల్లి

యశవంతపుర: ఓ ప్రమాదం రెండు విషాదాలకు కారణమైంది. చిక్కమగళూరు జిల్లా కళస తాలూకా కొళమాగె వద్ద గత గురువారం అదుపుతప్పి ఓ జీపు భద్ర నదిలో పడింది. జీపు నడుపుతున్న శమంత్‌ (23) గల్లంతయ్యాడు. శమంత్‌కు జీపు ఓనర్‌ – డ్రైవర్‌గా పనిచేసేవాడు, జీపులో కూలీలను వదిలి వస్తుండగా పడిపోయాడు. నాలుగు రోజుల నుంచి పోలీసులు, ఫైర్‌ సిబ్బంది గాలింపు జరిపారు. సోమవారం మధ్యాహ్నం మృతదేహాన్ని కనుగొన్నారు. కొడుకు నదిలో కొట్టుకుపోయాడని తెలిసి అతని తల్లి రవి కళ ఊరిలో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. కార్మికులను పికప్‌, డ్రాప్‌ చేస్తూ శమంత్‌ ఉపాధి పొందేవాడు. కొడుకు కోరిక మేరకు తల్లి రవికళ ఆరునెలల కిందటే అతనికి జీపును కొనిచ్చింది. గ్రామస్తులతో కలిసి ఘటనాస్థలికి వచ్చిన ఆమె కొడుకు నదిలో కొట్టుకుపోయాడని తెలిసి తల్లిడిల్లింది. గ్రామస్తులు ఆమెను ఓదార్చి ఇంటికి తీసుకెళ్లగా రాత్రి పదిన్నర సమయంలో ఇంటి వద్ద చెరువులోకి దూకి చనిపోయింది.

త్రినేత్రాయ నమః1
1/2

త్రినేత్రాయ నమః

త్రినేత్రాయ నమః2
2/2

త్రినేత్రాయ నమః

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement