
ఆస్తిపన్ను బకాయిలను వదలొద్దు
బనశంకరి: బీబీఎంపీ పరిధిలో 3.75 లక్షల మంది ఆస్తిపన్నుదారులు పన్ను చెల్లించలేదు, వారికి నోటీస్ జారీ చేసి వసూలు చేయాలని బీబీఎంపీ కమిషనర్ మహేశ్వర్‌రావ్ అధికారులను ఆదేశించారు. సోమవారం బీబీఎంపీ కేంద్ర కార్యాలయంలో సమావేశంలో మాట్లాడారు. బెంగళూరులో ఆస్తిపన్ను సేకరణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి, పకడ్బందీగా పన్ను సేకరణ చేపట్టాలి. ఇంకా 3.75 లక్షల ఆస్తిపన్నుదారులు సుమారు రూ. 800 కోట్ల వరకూ పాలికెకు పన్ను బకాయిలు ఉన్నారు. వారికి ఎస్‌ఎంఎస్ , ఈమెయిల్ ద్వారా నోటీస్ పంపిస్తాము. అప్పటికీ చెల్లించకపోతే తరువాతి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నగరంలో కొత్త ఖాతా కోసం 50 వేలకు పైగా దరఖాస్తులు చేశారని, వాటిని పరిష్కరించాలని సూచించారు. దీనివల్ల ఆస్తిపన్ను కూడా పెరుగుతుందన్నారు.
బీబీఎంపీ కమిషనర్ సూచన
3.75 లక్షల మంది బకాయిదారులు