
ఆగని మాజీ జవాన్ సత్యాగ్రహం
చింతామణి: తాలూకాలోని అంబాజిదుర్గా హోబళి రాయపల్లి గ్రామానికి చెందిన మాజీ జవాన్ శివానందరెడ్డి తనకు ప్రభుత్వం భూమిని మంజూరు చేయాలని చాలా ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నా ఫలితం లేదు. దీంతో తాలూకాఫీసు ముందు కుటుంబంతో కలిసి శనివారం నుంచి సత్యాగ్రహానికి దిగారు. సోమవారం తహశీల్దార్ సుదర్శన యాదవ్ వచ్చి సమస్య గురించి కలెక్టర్‌కు నివేదిక పంపామని, ధర్నాను విరమించాలని కోరారు. అయితే శివానందరెడ్డి, మాజీ జవాన్లు తిరస్కరించారు. తహసీల్దార్ ఎన్నిసార్లు విన్నవించినా వారు పట్టువీడలేదు. న్యాయం లభించేవరకు ధర్నాను కొనసాగిస్తామని, కలెక్టరు వచ్చేవరకు విరమించబోమని తెలిపారు.