
నేత్రావతి నదీ తీరంలో శోధన
● ధర్మస్థలలో మృతదేహాల కేసు...
శివాజీనగర: ధర్మస్థలలో వందలాది మంది మహిళల శవాలను పూడ్చిపెట్టారంటూ వచ్చిన ఆరోపణలపై సిట్ విచారణను కొనసాగిస్తోంది. నేత్రావతి నది ఒడ్డున ఫిర్యాదిదారులను తీసుకుని తనిఖీ ఆరంభించారు. ఫోరెన్సిక్ నిపుణులు, రెవెన్యూ, అటవీ, సర్వే అధికారులతో సమావేశం జరిపి తరువాత స్థల మహజరు చేపట్టారు. సిట్ అధికారి సీ.ఏ.సైమన్ నేతృత్వంలో ఫిర్యాదుదారులను అధికారులు స్థలానికి తీసుకొచ్చి భారీ భద్రత మధ్యలో ఎక్కడెక్కడ పూడ్చిపెట్టారు అనేది విచారించారు. గత రెండు రోజుల నుండి సిట్ అధికారులు ఫిర్యాదుదారులను సుమారు 14 గంటల పాటు విచారణ జరిపి సమాచారాన్ని సేకరించారు. సోమవారం బెళ్తంగడిలో ఉన్న సిట్ ఆఫీసులో సమావేశం జరిపారు. సిట్ చీఫ్ ప్రణవ్ మొహంతి పాల్గొన్నారు. స్థల మహజరు తరువాత ఫిర్యాదుదారులను కోర్టులో హాజరుపరుస్తారు.