
సిటీలో డెంగీ భూతం
నగరంలో రోడ్ల గుంతలను పూడ్చివేయాలని, డ్రైనేజీలు పూడిపోకుండా శుభ్రం చేయాలని కమిషనర్ చెప్పారు. డెంగీ జ్వరాలను అరికట్టాలని, గత వారంలోనే 69 మంది డెంగీకి గురయ్యారని తెలిపారు. జూలై నెలలో 442 కేసులు వచ్చాయి, జనవరి నుంచి ఇప్పటివరకు 1,685 మంది డెంగీ బారిన పడ్డారని తెలిపారు. దోమల లార్వాలు ఉత్పత్తి అయ్యే స్థలాలను గుర్తించి ఔషధాలు పిచికారీ చేసి నిర్మూలించాలన్నారు. ఇంటింటా డెంగీ జాగృతిని కల్పించాలన్నారు. దోమల బెడద లేకుండా ఇంటింటా ట్రాప్‌లను అమర్చుకోవాలని ప్రచారం చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రత్యేక కమిషనర్లు మునీశ్ మౌద్గిల్, కరీగౌడ, డాక్టర్ హరీశ్‌కుమార్, సురళ్కర్ వికాస్ కిశోర్, ప్రీతి గెహ్లాట్ పాల్గొన్నారు.