
ఘనంగా కార్గిల్ విజయ్ దివస్
బళ్లారిఅర్బన్: సరిహద్దుల్లో రాత్రింబగళ్లు శ్రమించి సైనికులు దేశాన్ని, దేశ ప్రజలను కాపాడతారని మాజీ ప్యారామిలిటరీ సైనికుల సంఘం జిల్లా కార్యదర్శి ప్రహ్లాద్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని డీఏఆర్ రిజర్వు మైదానంలో నిర్వహించిన కార్గిల్ విజయ్ దివస్‌లో ఆయన మాట్లాడుతూ సైనికులకు మనం ఏమి ఇచ్చినా రుణం తీరదన్నారు. ఏఎస్పీ నవీన్‌కుమార్ కూడా మాట్లాడారు. బళ్లారి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ లత, కార్పొరేటర్ హనుమంత, ఆ సంఘం అధ్యక్షుడు ప్రతాప్, చెన్నారెడ్డి, ప్రవీణ్‌కుమార్, మల్లేశ్వరి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
రాయచూరులో...
రాయచూరు రూరల్ : నగరంలో కార్గిల్ విజయ్ దివస్ నిర్వహించారు. శనివారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో బోసురాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ కార్గిల్ వీర యోధుల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి మాజీ సైనికులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యుద్ధంలో సైనికులు చేసిన సాహసాన్ని కొనియాడారు. కార్యక్రమంలో రవి బోసురాజు, చెన్నారెడ్డి, రాజశేఖర్ నాయక్ తదితరులున్నారు.

ఘనంగా కార్గిల్ విజయ్ దివస్