
నమో వేంకటేశ.. తిరుమలేశా
బనశంకరి: నమో వేంకటేశా.. నమో తిరుమలేశా.. అంటూ భక్తులు వైకుంఠవాసున్ని దర్శించుకున్నారు. ఆలయాలలో శ్రావణ పూజలు ఘనంగా జరిగాయి. బెంగళూరులో వసంతపుర వసంతవల్లభరాయస్వామి దేవస్థానం సన్నిధిలో శ్రావణమాస శనివారం పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు వీఆర్.రఘురామ భట్టర్ ఆధ్వర్యంలో వసంతవల్లభుడు మూలవిరాట్ అభిషేకం, అర్చనలు చేపట్టి విశేష అలంకరణ గావించారు. పెద్దఎత్తున తరలివచ్చి స్వామిని, దేవేరులను దర్శించుకున్నారు.
అగర వెంకన్న ఆలయంలో
బొమ్మనహళ్లి: శ్రావణ మాసం మొదటి శనివారం సందర్భంగా బెంగళూరులోని వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బొమ్మనహళ్లిలోని హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ అగరలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున 4 గంటలకే పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అర్చకుడు అనంతపురం చంద్రమౌళి స్వామివారికి విశేషంగా పూలతో అలంకరించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.
గౌరిబిదనూరులో..
గౌరిబిదనూరు: శ్రావణ మాసం మొదటి శనివారం సందర్భంగా నగరంలో పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అర్చకుడు మురళీస్వామి ఆధ్వర్యంలో ఉదయం అభిషేకాలు, పూల అలంకరణ, తీర్థ ప్రసాద వితరణ జరిగింది. వందలాది మంది భక్తులు దర్శనం చేసుకున్నారు.
భక్తిశ్రద్ధలతో శ్రావణ శనివార పూజలు

నమో వేంకటేశ.. తిరుమలేశా

నమో వేంకటేశ.. తిరుమలేశా