
జపాన్‌కు చేరిన గజరాజులు
బొమ్మనహళ్ళి: బెంగళూరు బన్నేరుఘట్ట జూ పార్క్ నుంచి జపాన్‌కు వన్యప్రాణుల వినిమయంలో భాగంగా పంపిన ఏనుగులు అక్కడికి క్షేమంగా చేరుకున్నాయి. సురేష్ (8), గౌరి (9), శృతి (7), తులసి (5) అనే 4 ఏనుగులను విమానశ్రయం నుంచి సరుకు రవాణా విమానంలో గురువారంనాడు పంపించారు. శుక్రవారం ఉదయం జపాన్‌కు చేరాయి. విమానాశ్రయంలో కంటైనర్లలో ఉంచి హిమెజి జూ పార్క్‌కు తరలించారు. కొన్నివారాల పాటు అక్కడ ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉంచి ఎలాంటి అంటువ్యాధులు లేవని నిర్ధారించాక జూలోకి పంపుతారు. ఏనుగులతో వెళ్లిన బన్నేరుఘట్ట సిబ్బంది వాటికి రాగులు, బియ్యం, అరటిపండ్లు, కూరగాయల మెనును అందజేశారు.
తుపాకీతో బెదిరించి
నగల షాపులో దోపిడీ
దొడ్డబళ్లాపురం: గన్‌తో బెదిరించి జ్యువెలరీ షాప్‌లో దోపిడీకి పాల్పడ్డ సంఘటన బెంగళూరు ఉత్తర తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మాచోహళ్లి గేట్ వద్ద ఉన్న రామ్ జ్యువెలరీ షాప్‌లోకి గురువారం రాత్రి 8–30 గంటల సమయంలో ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు చొరబడ్డారు. సరిగ్గా అప్పుడే షాపు మూసివేస్తున్నారు. గన్ చూపించి చేతికందిన బంగారు నగలు దోచుకుని పరారయ్యారు. షాపు యజమాని కన్నయ్యలాల్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దోపిడీ ఘటన సీసీ కెమెరాలలో రికార్డయింది.
ప్రేమ గొడవ..
యువకుని హత్య
దొడ్డబళ్లాపురం: యువతితో ప్రేమ యువకుని ప్రాణం తీసిన సంఘటన ఆనేకల్‌లో చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని 9వ వార్డు నివాసి రవికుమార్ (21), శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో వినాయక నగరలోని ఒక షాపు వద్ద స్నేహితులతో కలిసి కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు అతనిని కట్టెలతో బాది పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ రవికుమార్‌ను ఆస్పత్రికి తరలించగా శనివారంనాడు చికిత్స ఫలించక చనిపోయాడు. అమెజాన్‌లో పని చేస్తున్న రవికుమార్ ఒక అమ్మాయిని ప్రేమించేవాడు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు వచ్చి విడిపోయారు. యువతి తమ్ముడు తన ముఠాతో వచ్చి దాడి చేసినట్టు తెలిసింది. సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా నిందితులను గుర్తించారు. దుండగులు పరారీలో ఉన్నారు.

జపాన్‌కు చేరిన గజరాజులు

జపాన్‌కు చేరిన గజరాజులు