
భూమి కోసం మాజీ జవాన్ సత్యాగ్రహం
చింతామణి: దేశమంతటా కార్గిల్ విజయోత్సవాలను జరుపుతుంటే, దేశం కోసం పోరాడిన ఓ రిటైర్డు సైనికుడు అధికారుల నిర్లక్ష్యంపై నిరసనకు దిగారు. మాజీ సైనికుడు శివానందరెడ్డి, భార్యతో కలిసి ఉపవాస సత్యాగ్రహం చేపట్టారు. వివరాలు.. శివానందరెడ్డి జవాన్‌గా పనిచేస్తూ సరిహద్దుల్లో ప్రమాదంలో అంగ వైకల్యం పొందినట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి నిబంధనల ప్రకారం పొలం రావాలి. కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. తాను 24 ఏండ్ల నుంచి ప్రభుత్వాలపై పోరాటం చేస్తున్నా ప్రయోజనం లేదని వాపోయారు. సీఎంలు, కలెక్టర్ల దృష్టికి తెచ్చిన ఉపయోగం లేదన్నారు. భూమి మంజూరు చేయాలంటే లంచం ఇవ్వాలని కొందరు అధికారులు వేధిస్తున్నారని తెలిపారు. కాగా, అధికారులు ఆయనతో మాట్లాడి త్వరలో భూమిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.