
ప్రజల సమస్యలు సత్వరం తీర్చండి
రాయచూరు రూరల్: జిల్లాలో ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించాలని రాష్ట్ర ఉప లోకాయుక్త బి.వీరప్ప అధికారులకు సూచించారు. గురువారం జిల్లాధికారి కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్సు సమావేశంలో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను శాఖల వారీగా పరిష్కారానికి అవకాశం కల్పించాలన్నారు. నిజమైన లబ్ధిదారులకు లబ్ధి చేకూరకుండా ఇతరులకు లాభం చేకూరేలా చేయడాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు సరైన చికిత్సలు అందేలా చూడాలన్నారు. ఈ విషయంలో వైద్యులు ప్రైవేట్ క్లినిక్‌లకు రావాలంటూ ఆదేశిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను అధికారులు పరిశీలించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారులు అంగన్‌వాడీల్లో పౌష్టిక ఆహారం అందేలా చూడాలని కోరారు. నరేగ పనుల్లో కూలీలకు వేతనాలు చెల్లించడంలో జాప్యం తగదన్నారు. ఆక్రమించిన సర్కారీ భూములను స్వాధీనం చేసుకోవాలని అదికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లాధికారి నితీష్, జెడ్పీ సీఈఓ ఈశ్వర్ కుమార్, అధికారులు నవీన్ కుమార్, వీరేష్ నాయక్, చంద్రకళ, శ్రీదేవి, రాజేంద్ర, రవిలున్నారు.