రేపు జిల్లా స్థాయి పత్రికా దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

రేపు జిల్లా స్థాయి పత్రికా దినోత్సవం

Jul 26 2025 9:12 AM | Updated on Jul 26 2025 9:12 AM

రేపు

రేపు జిల్లా స్థాయి పత్రికా దినోత్సవం

రాయచూరు రూరల్‌: జిల్లాలోని లింగసూగూరులో ఈనెల 27న జిల్లా స్థాయి పత్రికా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం జిల్లాధ్యక్షుడు గురునాథ్‌ పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగసూగూరు విజయ మహంతేశ్వర మఠంలో రాష్ట్ర వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణ ప్రకాష్‌ పాటిల్‌, రాయచూరు లోక్‌సభ సభ్యుడు, శాసన సభ్యుడు, విధాన పరిషత్‌ సభ్యులు, జిల్లాధికారి, జెడ్పీ సీఈఓ, జిల్లా ఎస్పీ పాల్గొంటారన్నారు. ఇద్దరు విలేకరులకు జీవమాన అవార్డు, 11 మందికి సామాన్య అవార్డులను అందజేస్తారన్నారు. విలేఖర్ల సమావేశంలో వర్కింగ్‌ జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి పాషా, శివప్ప మడివాళ, సిద్దయ్య స్వామిలున్నారు.

ఆధునిక పరిజ్ఞానానిదే భవిష్యత్తు

రాయచూరు రూరల్‌: నేటి ఆధునిక యుగంలో వైద్య రంగానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మంచి భవిష్యత్తు ఉందని నవోదయ వైద్య కళాశాల రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. నవోదయ వైద్య కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎంబీబీఎస్‌ విద్యార్థులకు మ్యూజియం ఎంతో సహాయకారిగా ఉంటుందన్నారు. రాయచూరు నవోదయ వైద్య కళాశాలలో డోసేజే ఫార్‌మ్స్‌, మాలిక్యులర్‌, మానవ శరీర రచన, క్రియా శాస్త్రాలు, మందుల ప్రాక్టీస్‌ వంటివి ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు శాలిని, మహదేవ స్వామి, రైసాన, చంద్రిక కట్టి, గిరీష్‌ కట్టిలున్నారు.

ఉపాధ్యాయ పోస్టులు

భర్తీ చేయరూ

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 70 వేల ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని ఏఐడీఎస్‌ఓ డిమాండ్‌ చేసింది. శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు బసవరాజ్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 1వ తరగతి నుంచి విద్యార్థులకు పాస్‌ పద్ధతిని జారీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ జిల్లా విద్యాశాఖాధికారి బడిగేరకు వినతిపత్రం సమర్పించారు.

కార్మికులకు సౌకర్యాలు ఏవీ?

రాయచూరు రూరల్‌: స్థానిక సంస్థలో విధులు నిర్వహించే కార్మికులు, సఫాయి కర్మచారులకు సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర సఫాయి కర్మచారుల కమిషన్‌ కార్యదర్శి చంద్రకళ సూచించారు. జిల్లా పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులను ఆమె ఆదేశించారు. వారి సంఖ్యకు అనుగుణంగా వసతుల ఏర్పాటు, ఇన్సూరెన్సు, భద్రతా కవచం, ఆరోగ్య భాగ్యలో సంజీవని కార్డులను అందించాలని సూచించారు. సమావేశంలో కమిషనర్‌ జుబీన్‌ మహాపాత్రో, అధికారులు వైశాలి, మహదేవ స్వామి, సిందూరు, ఈరణ్ణ, చంద్రశేఖర్‌, సంతోష్‌ రాణిలున్నారు.

ఐకమత్యంగా పని చేయండి

రాయచూరు రూరల్‌: భారతీయ జీవిత బీమా(ఎల్‌ఐసీ) సంస్థలో ప్రతి ఒక్కరూ కలసి కట్టుగా పని చేయాలని ఎల్‌ఐసీ దక్షిణ మధ్య హైదరాబాద్‌ జోనల్‌ మేనేజర్‌ పునీత్‌ కుమార్‌ అధికారులకు, ఉద్యోగులకు, ఏజెంట్లకు సూచించారు. శుక్రవారం రాయచూరు ఎల్‌ఐసీ డివిజన్‌ మోడరన్‌ జెడ్‌ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. పాలసీల లక్ష్యంతో సంస్థను అభివృద్ధి మార్గంలో పయనించడానికి ఐక్యతతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో రాయచూరు ఎల్‌ఐసీ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ మేనేజర్‌ ప్రసాద్‌ బసవరాజ్‌, వెంకటేశ్వర రావు, హిలాలీ, చిరంజీవి, రవిలున్నారు.

రేపు జిల్లా స్థాయి పత్రికా దినోత్సవం 1
1/3

రేపు జిల్లా స్థాయి పత్రికా దినోత్సవం

రేపు జిల్లా స్థాయి పత్రికా దినోత్సవం 2
2/3

రేపు జిల్లా స్థాయి పత్రికా దినోత్సవం

రేపు జిల్లా స్థాయి పత్రికా దినోత్సవం 3
3/3

రేపు జిల్లా స్థాయి పత్రికా దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement