
ఘనంగా చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు
బళ్లారిటౌన్: నగరంలోని రూపనగుడి రోడ్డులోని హులిగమ్మ చౌడేశ్వరి దేవి ఆలయంలో గురువారం అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా చౌడేశ్వరి దేవి అమ్మవారికి కూరగాయల అలంకరణతో పూజలు చేశారు. ఈ పూజలు, జయంతి ఉత్సవాల్లో సిటీ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, పారిశ్రామికవేత్త రమేష్ గోపాల్ తదితరులు వచ్చి విశేషంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో భగవద్గీత శ్లోకాలు, లలితా పారాయణం పఠించారు. కార్యక్రమాల్లో పలువురు కార్పొరేటర్లు, చేనేత వర్గాల నేతలు దేవానంద, చంద్రశేఖర, ధనుంజయ, యలంకి రాజు, కోడి రాజు, బాలరాజు, జీఆర్ వెంకటేశ్వర్లు తదితర నేతలు పాల్గొన్నారు. అదే విధంగా సాయంత్రం రైల్వే కాలనీలోని చౌడేశ్వరి ఆలయంలో కూడా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపారు. ధర్మకర్త నాగభూషణ్, గోపాల్, శ్రీనివాసులు, చంద్రశేఖర, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
గుండె పరీక్ష శిబిరం
రాయచూరు రూరల్: నగరంలోని రైల్వేస్టేషన్ రహదారిలోని స్పర్శ ఆస్పత్రిలో గురువారం ఉచిత ఒక రోజు గుండెపోటు వ్యాధి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలు తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని గుండె వ్యాధుల నిపుణుడు డాక్టర్ నిఖిల్ షా సూచించారు. అధిక భాగం 30–50 ఏళ్ల లోపు మహిళలు, పురుషులు, యువతీ యువకులు గుండె పోటు వల్ల మరణిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో 8 చోట్ల ఉచిత ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. సుమారు 250 మంది ఈసీజీ, గుండెపోటు చికిత్సా శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారన్నారు. ఈ సందర్భంగా వైద్యులు రవి కుమార్, హర్ష, శివ కుమార్, స్పర్శ ఆస్పత్రి నిర్వాిహకుడు రాజశేఖర్ పాటిల్, అమరే గౌడ, రాచప్ప, బసవరాజ్ మలకప్ప గౌడ పాల్గొన్నారు.

ఘనంగా చౌడేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు