
పిల్లల ప్రతిభను ప్రోత్సహించాలి
హొసపేటె: కొప్పళలోని శ్రీశైల నగర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బెంగళూరు రాష్ట్ర బాల భవన్ సొసైటీ, జిల్లా పంచాయతీ, మహిళా, శిశు అభివృద్ధి శాఖ, కొప్పళ జిల్లా బాల భవన్ కమిటీ, కొప్పళ తాలూకా బాల భవన్ కమిటీ, పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖల సహకారంతో బాలల కళా ప్రతిభా కార్యక్రమాన్ని నిర్వహించారు. కొప్పళ శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారిణి రోహిణి కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ పిల్లల్లోని ప్రతిభను ప్రోత్సహించాలన్నారు. పాఠ్యాంశాలతో పాటు పాఠ్యేతర కార్యకలాపాల్లో పిల్లలు పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించవచ్చన్నారు. ఇలాంటి పోటీలు పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. పిల్లలు ఇలాంటి పోటీల్లో పాల్గొనాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా విద్యాధికారి హనుమంతప్ప, పాఠశాల హెచ్‌ఎం బాలనాగమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.