
ఇకపై రోబోట్‌తో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం
● నగరంలో స్కావెంజర్‌లతో పని లేదు
● రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రయత్నం
రాయచూరు రూరల్: నిండిన సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరచడానికి గతంలో స్కావెంజర్(సఫాయి కర్మచారి)లను వినియోగించేవారు. అయితే రాయచూరు నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో బుధవారం నగరంలో బోట్ యంత్రంతో సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరిచే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇకపై రోబోట్ స్కావెంజర్ ద్వారా సెప్టిక్ ట్యాంక్ శుభ్రపరుస్తారన్నారు. నగరాన్ని స్వచ్ఛ, సుందర నగరంగా తీర్చిదిద్దాలనే ఆశయంతో పని చేయాలన్నారు. ఇంచార్జి అధ్యక్షుడు సాజిద్ సమీర్, విజయలక్ష్మి తదితరులున్నారు.