
ముస్టూరు వంతెనకు మోక్షమెన్నడో?
రాయచూరు రూరల్: పల్లెలు అభివృద్ధికి ఆమడ దూరం అనడానికి రెండు ప్రధాన సాక్ష్యాలు దర్శనమిస్తున్నాయి. గ్రామీణ ప్రాంత రహదారులు, వంతెనలు మరమ్మతు పనుల పేరుతో నిధులను కాంట్రాక్టర్లు నిలువుదోపిడీకి పూనుకున్నారు. రాయచూరు జిల్లా మాన్వి తాలూకాలో మణ్ణూరు జాగీర్ పన్నూరు, యడివాళల మధ్య ఉన్న ముస్టూరు వంతెన ఆరేళ్ల కిందట కురిసిన వర్షాలకు ధ్వంసమై వంకర టింకరగా మారింది. ప్రజలు సంచరించే ఈ వంతెన నిర్మాణ విషయంలో మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్ అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు చేపట్టాల్సి ఉంది. మరో వైపు చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు ఈ విషయంలో జోక్యం చేసుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉంది. మరో వైపు నెలన్నర రోజుల క్రితం రాయచూరు తాలూకా పత్తేపూర్‌లో భారీ వర్షాలకు వంతెన కొట్టుకుని పోయింది. ఈ నేపథ్యంలో గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ నేటికీ ఆ గ్రామాల వైపు వెళ్లకుండా, వంతెన బాగోగులను గురించి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.
ఏళ్లు గడుస్తున్నా పనుల ఊసే లేదు
నరకయాతన పడుతున్న గ్రామస్తులు