
రాయచూరును వీడని వర్షం
రాయచూరు రూరల్: జిల్లాతో పాటు నగరంలో గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి, మంగళవారం జడివానలు పడ్డాయి. జిల్లాలో 52 మి.మీ.ల వర్షం కురిసింది. ఎక్కడ చూసినా రహదారులు నీటి మడుగులుగా మారాయి. నిజలింగప్ప కాలనీ, మడ్డిపేట, బైరూన్ కిల్లా, మహావీర చౌక్, కూరగాయల మార్కెట్‌లలో వర్షపు నీరు నిలిచాయి. తీన్ కందిల్‌లో రాతి ఏనుగు విగ్రహంలోకి మురుగు నీరు చేరాయి. అరబ్ మోహల్లా, షియా తలాబ్, ఖాదర్‌గుండా, నవాబ్ గడ్డలలోకి నీరు చేరాయి. అంబేడ్కర్ సర్కిల్ నుంచి బాబూ జగ్జీవన్ రాం సర్కిల్ వరకు వాన నీరు నిండుగా ప్రవహించాయి.

రాయచూరును వీడని వర్షం