
కుటుంబంపై పురుగుల మందు పంజా
రాయచూరు రూరల్: పురుగుల మందుతో కలుషితమైన ఆహారం తండ్రి, ఇద్దరు కూతుళ్లను పొట్టనబెట్టుకుంది. తల్లి, ఇద్దరు పిల్లలు అస్వస్థతకు గురైన ఘటన రాయచూరు జిల్లాలోని సిరవార తాలూకా కవితాళ మండలం కడ్డోణి తిమ్మాపురలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పొలంలో పండించిన చిక్కుడు పంటకు ఒకరోజు కిందటే పురుగుల మందును పిచికారీ చేశారు. ఆ చిక్కుడు కాయలు కోసుకొచ్చి కూరచేసి రొట్టెలతో భోజనం చేశారు. విష ప్రభావంతో అర్ధరాత్రి కడుపు నొప్పి, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. మామూలు సమస్యే కదా అని పెద్దగా పట్టించుకోలేదు. చివరకు ఇరుగుపొరుగు చూసి ఆరుగురు కుటుంబ సభ్యులను లింగసూగూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆరోగ్యం విషమించడంతో రమేష్ నాయక్ (38), కూతుళ్లు నాగమ్మ (8), దీపా (6) మరణించారు. భార్య పద్మావతి (35), కుమారుడు కృష్ణ(10), మరో కూతురు చైత్రా (10) పరిస్థితి విషమంగా ఉండగా, రాయచూరు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
పిచికారి చేసిన బీన్స్‌తో కూర
తండ్రీ, ఇద్దరు కూతుళ్లు మృత్యువాత
తల్లి, మరో ఇద్దరికి విషమం
రాయచూరు జిల్లాలో ఘోరం

కుటుంబంపై పురుగుల మందు పంజా

కుటుంబంపై పురుగుల మందు పంజా

కుటుంబంపై పురుగుల మందు పంజా

కుటుంబంపై పురుగుల మందు పంజా

కుటుంబంపై పురుగుల మందు పంజా