
బనశంకరీదేవి సన్నిధిలో భక్తసాగరం
బనశంకరి: భక్తుల కోర్కేలు తీర్చే కొంగు బంగారమైన నగరంలోని బనశంకరీదేవి ఆలయానికి భక్తజనం తరలివచ్చారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి సన్నిధిలో విశేష పూజలు నిర్వహించారు. మంగళవారం వేకువజామున సుప్రభాతసేవ అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ అమ్మవారి మూలవిరాట్ కు ప్రత్యేక అభిషేకం, అర్చన చేసి తమలపాకులతో విశేషంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దఎత్తున విచ్చేయడంతో ఆలయం రద్దీగా మారింది. నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేశారు. ప్రత్యేక క్యూలైన్ల ద్వారా దేవిని దర్శించుకున్నారు.
ఆషాఢ మంగళవారం పూజలు

బనశంకరీదేవి సన్నిధిలో భక్తసాగరం