
జిమ్ ట్రైనర్ వంచన పర్వం
● దొడ్డలో కలకలం
దొడ్డబళ్లాపురం: దొడ్డ పట్టణ పరిధిలోని కరేనహళ్లి నివాసి జిమ్ ట్రైనర్ అయిన గౌతమ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో ఒక యువతిని ప్రేమ పేరుతో వంచించి గర్భవతిని చేసిన గౌతమ్ ఆమెను వదిలేశాడు. దీంతో బాధిత యువతి కోర్టులో కేసు వేసింది. కేసు నడుస్తుండగా గౌతమ్, కుటుంబ సభ్యులు 20 రోజుల క్రితం ఆమెను ప్రాధేయపడి ఇంటికి తీసుకువచ్చారు. ఏదో సాకుతో ఆమెను నిత్యం వేధించసాగారు.
రెండో భార్య అని మరొకరు..
ఇలా ఉండగా రెండురోజుల క్రితం మళ్లీ మరో యువతిని ఇంటికి తీసుకువచ్చి తన భార్యే అని, గర్భవతి అని చెప్పాడు. ఇది తెలిసి సోమవారంనాడు మొదటి భార్య తరఫు కుటుంబ సభ్యులు, బంధువుల వచ్చి గౌతమ్ ఇంట్లో గొడవపడ్డారు. అప్పుడు ఇంట్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. మొదటి భార్య నిప్పుపెట్టిందని భర్త, నన్ను చంపడానికే మంటలు పెట్టి తోసేయాలని చూశారని మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ గొడవలు స్థానికులకు తలనొప్పిగా మారాయి.