
భారీ వర్షం.. లోతట్టు జలదిగ్బంధం
రాయచూరు రూరల్: నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిిసింది. ఎక్కడ చూసినా రహదారులు నీటి గుంటలుగా మారాయి. రంగ మందిరం వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జిలో నీరు చేరి ప్రజలను పలు ఇబ్బందులకు గురి చేసింది. రాత్రి మోకాలి లోతున నీరు నిల్వ చేరింది. రైల్వే స్టేషన్ నుంచి మంత్రాలయం రోడ్డులో ఐబీ వరకు నీరు అధికంగా ప్రవహించాయి. రంగమందిరం వద్ద నీరు నిలిచాయి. నిజలింగప్ప కాలనీలో మురుగు కాలువల్లో నీరు ముందుకు సాగక ముడుగులా కన్పించాయి. కిల్లె బృహన్మఠం, మడ్డిపేట ఇతర ప్రాంతాల్లో వాన నీరు అధికంగా పారింది. మున్నూరు వాడి, బంగికుంట, గద్వాల్ రహదారి, గాంధీ చౌక్, మహావీర చౌక్, కూరగాయల మార్కెట్‌లో వర్షపు నీరు చొరబడ్డాయి. ప్రజలు పలు ఇబ్బందులకు గురి అయ్యారు.

భారీ వర్షం.. లోతట్టు జలదిగ్బంధం