
పావగడకు తుంగభద్ర జలాలు
తుమకూరు: తుంగభద్రా జలాశయం నుంచి తుమకూరు జిల్లాకు నీటిని అందిస్తామని సీఎం సిద్దరామయ్య చెప్పారు. పావగడ తాలూకాకు, పట్టణానికి పరిశుభ్రమైన తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేశాం, 17.50 లక్షల మంది ఆరోగ్యానికి రక్షణ నిచ్చామని చెప్పారు. సోమవారం పావగడలో తుంగభద్ర డ్యాం నుంచి పావగడకు మంచినీటిని అందించే పథకాన్ని ప్రారంభించారు. అలాగే 2,250 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇక్కడి ప్రజలకు ఫ్లోరైడ్ రహిత నీటిని అందించాలని 2018లో ఈ నీటి పథకానికి శంకుస్థాపన చేశానని, 200 కిలోమీటర్ల దూరంలోని టీబీ డ్యాంనుంచి పావగడకు నీటిని తీసుకువచ్చామని చెప్పారు. ఇకనుంచి ఇక్కడి 270 గ్రామాలకు తాగునీటి సమస్య ఉండబోదన్నారు. ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌లు రోజూ అబద్ధాలు చెబుతూ ఉన్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.
17 లక్షల మందికి లబ్ధి
సీఎం సిద్దరామయ్య