
రక్తదానంపై జాగృతి అవసరం
హుబ్లీ: రక్తదానం చేస్తే అనారోగ్యం కలుగుతుందన్న భయం కొందరిలో ఉండగా, మరికొందరికేమో అవగాహన లేదని, దీనిపై జాగృతి కల్పించాల్సిన అవసరం ఉందని ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత వ్యవస్థాపక ప్రముఖులు మంగేష్ బేండె తెలిపారు. మూరు సావిర మఠంలో కర్ణాటక బ్యాంక్ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా రక్త సేకరణకు వితరణ చేసిన అత్యాధునిక రక్త సేకరణ వాహనం జాతికి అంకితం చేసి ఆయన మాట్లాడారు. ఆ మఠం గురుసిద్ద రాజయోగీంద్ర స్వామి సాన్నిధ్యం వహించి మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం శ్రేష్టమైందన్నారు. రక్తదానం ప్రాణాలను కాపాడుతుందన్నారు. బ్లడ్ బ్యాంక్ ముఖ్యస్తులు దత్తమూర్తి కులకర్ణి, ఆ బ్యాంక్ ఏజీఎం ఈరణ్ణ నాగరాళ, బ్యాంక్ జీఎం అరుణ్‌కుమార్, సంజీవ గలగలి, హృద్రోగ నిపుణులు డాక్టర్ విజయ్‌కృష్ణ, జగదీశ్ హిరేమఠ పాల్గొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ ప్రముఖులు మంగేష్ బేండె
సంచార రక్త సేకరణ వాహనం ప్రారంభం